లైఫ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడంలో పెన్షనర్లకు వెసులుబాటు

  • ఆండ్రాయిడ్‌ సెల్‌ఫోన్‌లో టీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

  •      సెల్‌ నంబర్, ఈ మెయిల్‌ ద్వారా రిజిష్ట్రేషన్‌ చేసుకోవాలి. ఆ తర్వాత యూజర్‌ ఐడీగా సెల్‌ నంబర్‌ మారుతుంది. పిన్‌ను పాస్‌వర్డ్‌గా సెట్‌ చేసుకోవాలి. 

  •      సెల్‌ నంబర్, పాస్‌ వర్డ్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా లాగిన్‌ అవ్వాలి. అనంతరం పెన్షనర్‌ మాన్యువల్‌ వెరిఫికేషన్‌ ఆప్షన్‌ ద్వారా ఎంటర్‌ అవ్వాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకుని బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ లేదా పెన్షనర్‌ ఐడీ నంబర్‌ నమోదు చేయాలి. ఓటరు ఐడీ కార్డు కార్డుపై ఉండే ఎపిక్‌ నంబర్, అసెంబ్లీ నియోజకవర్గం పేరు నమోదుచేయాలి.

  • అనంతరం ఒక సెల్ఫీ తీసుకోవాలి. ఆ సెల్ఫీఫొటో ఎపిక్‌ కార్డులోని ఫొటోతో వెరిఫై చేయబడి ఆమోదించినట్లు వెరిఫికేషన్‌ నంబర్‌ వస్తుంది. ఆ మెసేజ్‌ సంబంధిత ట్రెజరీ కార్యాలయానికి చేరుతుంది.

  •      ట్రెజరీ కార్యాలయంలో అధికారి తనకు వచ్చిన వివరాలు, తన వద్ద అందుబాటులో ఉన్న వివరాలతో పోల్చి చూసుకుని ఆమోదిస్తారు. 

  •      దీని ద్వారా పెన్షనర్లు సుదూర ప్రాంతాల నుంచి ట్రెజరీ కార్యాలయానికి వచ్చే ఇబ్బంది ఉండదు. బ్యాంకులు, మీసేవ కేంద్రాలకు వెళ్లే అవసరం ఉండదు. ఇంటివద్దనే ఉండి ధ్రువీకరణ పత్రం అందజేయవచ్చు. ప్రస్తుతం మొబైల్‌ యాప్‌తో ధ్రువీకరణ పత్రం ఇచ్చే సదుపాయం కల్పించిన మొదటి రాష్ట్రం తెలంగాణ.