ఫస్ట్ టైం గెస్ట్ రోల్ లో 'రామ్'
దర్శకుడు పూరిజగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా 'రొమాంటిక్' చిత్రం తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించనున్నాడు హీరో రామ్. పూరి జగన్నాథ్ అందించిన కథతో నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పూరి, చార్మి నిర్మిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కేతికా శర్మ హీరోయిన్. ఇందులో మందిరా బేడీ, దివ్య దర్షినీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రమ్యకృష్ణ అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు రామ్ గెస్ట్‌గా నటించారనే వార్త బయటికొచ్చింది. ఈ సినిమాలో ఓ సర్‌ప్రైజ్‌గా రామ్ పాత్ర ఉంటుందని సమాచారం. ఈ పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేశాడట రామ్.